ఆఫ్ఘనిస్తాన్ సెట్ వేయించుకున్న కమల్

ఆఫ్ఘనిస్తాన్ సెట్ వేయించుకున్న కమల్

Published on Nov 24, 2011 3:55 PM IST


కమల్ హాసన్ తదుపరి చిత్రం విశ్వరూపం ప్రస్తుతం శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం ఒక ప్రత్యేకమైన ఆఫ్ఘనిస్తాన్ సెట్ వేసినట్టు సమాచారం. ఈ చిత్రం లో కమల్ హాసన్ ఒక కరుడుగట్టిన తాలిబాన్ ఉగ్రవాది పాత్ర పోషిస్తున్నారు. ఈ సెట్ ని అమెరికా సైనిక దళాలు ఉండే కొన్ని సన్నివేశాలకి వాడుతున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రానికి కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరొక విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ కథ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు అని చిత్ర సీమ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఒకే సారి తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు