“రాధే శ్యామ్”లో మంచు మనోజ్ బ్యూటీ..అది కూడా 8ఏళ్ళకి.!

Published on Mar 14, 2021 10:41 am IST

పలు కారణాల చేత కొంతమంది నటులు నటీమణులు కొంత కాలం సినిమాలకు దూరం అవుతారు అలాగే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. అలా గత ఎనిమిదేళ్ల కితం మంచు వారి యాక్షన్ హీరో మంచు మనోజ్ నటించిన “పోటుగాడు” తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ పాన్ ఇండియన్ లెవెల్ ఎంట్రీ సిద్దమయ్యినట్టు తెలుస్తుంది. ఆమెనే సిమ్రాన్ కౌర్ ముంది.

ఈమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”తో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనుందట. పలు కారణాల వల్ల టాలీవుడ్ కు దూరం అయ్యిన ఈమెకు ఇన్నాళ్లకు రాధే శ్యామ్ టీం నుంచి కాల్ రావడంతో సెకండ్ థాట్ లేకుండా ఓకే చేసేసిందట. తనకి ఒక్క సీన్ ఉన్న రోల్ మాత్రమే ఉన్నా చాలా బాగుంటుందని ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటకు తెలిసింది. ఇక ఈ భారీ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :