వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ కలక్షన్ల పరంగా రికార్డులను సృష్టిస్తూ వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. ఆయన నటించిన గత చిత్రాలు ‘పీకే , దంగల్ , సీక్రెట్ సూపర్ స్టార్’ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా పలు జాతీయఅవార్డులను ఖాతాలో వేసుకున్నాయి.
ఇక ఎట్టకేలకు అమీర్ ఖాన్ జోరు కు బ్రేక్ వేసింది ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. ఆయన నటించిన ఈ చిత్రం భారీ హైప్ తో నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అమీర్ తన నటన తో చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినా వీక్ స్టోరీ , డైరెక్షన్ లో లోపల కారణంగా చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ఫలితంగా చాలా రోజుల తరువాత అమీర్ ఈ చిత్రం తో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఊహించినట్లుగానే మొదటి రోజు ఈ చిత్రం అక్కడ 50కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండో రోజు నుండి ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ భారీ గా డ్రాప్ కానున్నాయి.


