బిగ్ బాస్ 4 – అభి తర్వాత అంత క్లియర్ గా ఉండే కంటెస్టెంట్ తనేనా.?

Published on Nov 28, 2020 8:00 am IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 4 ను కూడా ఇంకొన్ని రోజుల్లో పూర్తి చేసుకోనుంది. అయితే ప్రతీ సీజన్లో లానే ఈ సారి కూడా కొంత మంది టాప్ కంటెస్టెంట్స్ ఎవరో మేకర్స్ అలాగే వీక్షకులకు కూడా అర్ధం అయ్యిపోయింది. అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఆడియెన్స్ పల్స్ ప్రకారం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా ఉంది మాత్రం అభిజీత్ అని చెప్పాలి.

కొన్ని ఫిజికల్ టాస్కుల పరంగా వీక్ అయినా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా అభి ఉంటాడని వీక్షకులు అలాగే మిగతా కంటెస్టెంట్స్ చెప్పే మాట. మరి హౌస్ లో పరితిత్తులను అర్ధం చేసుకొని వాటికి అనుగుణంగా ఉండే కంటెస్టెంట్ ఎవరు అనే విషయానికి వస్తే ఇన్ని రోజులు హారిక పేరు కూడా వినిపించేది. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె చక్కటి నిర్ణయాలు తీసుకొని మెప్పించింది.

అయితే ఇప్పుడు మరో క్లియర్ కంటెస్టెంట్ గా అరియనా పేరు కూడా వినిపిస్తుంది. ఇన్నాళ్లు పెద్దగా వెలుగు లోకి రాలేదు కానీ ఈమె విషయంలో కూడా ఇపుడు వీక్షకులు ఇదే అంటున్నారు. అందుకే ఈమె గ్రాఫ్ కూడా పెరుగుతుంది అని తెలుస్తుంది. పలు సందర్భాల్లో అరియానా ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అనిపించినా ఆమె మాటల్లో ఖచ్చితంగా పాయింట్ ఉంటుంది.ఎక్కడికో ఎందుకు నిన్నటి ఎపిసోడ్ లోనే అఖిల్ తో జరిగిన కాన్వో లో చూడొచ్చు. సో ఈమె కూడా అభి తర్వాత మంచి క్లియర్ గా ఉండే కంటెస్టెంట్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :

More