పెళ్లి తరువాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్ !

Saisha1

తమిళ హీరో ఆర్య , రైజింగ్ హీరోయిన్ సయేశా ల పెళ్లి ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత సయేశా తిరిగి షూటింగ్లో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె కన్నడ లో స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన యువరత్న సినిమాలో నటిస్తుంది. ఈచిత్రం యొక్క షూటింగ్ బెంగుళూరు లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో జాయిన్ అయ్యింది సయేశా. కన్నడ లో ఆమె కు ఇదే మొదటి సినిమా.

ఇక ఈ చిత్రం తోపాటూ సయేశా తమిళంలో సూర్య సరసన కప్పాన్ చిత్రంలో నటిస్తుంది. ఈచిత్రంలో ఆర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version