“అవతార్”, “టైటానిక్” ల తర్వాత దళపతి సినిమానే..

“అవతార్”, “టైటానిక్” ల తర్వాత దళపతి సినిమానే..

Published on Apr 23, 2024 5:59 PM IST


వరల్డ్ వైడ్ గా భారీ హిట్ అయ్యిన పలు సంచలన విజయ చిత్రాల్లో దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించినవే టాప్ లో ఉంటాయి. మరి ఆ చిత్రాలే “అవతార్” “టైటానిక్” లు కాగా ఈ సినిమాలు ఇన్నేళ్ళలో ఎన్నోసార్లు రీ రిలీజ్ కి వచ్చాయి. ఇక మరో పక్క ఇటీవల మన దేశంలో ముఖ్యంగా సౌత్ సినిమా దగ్గర ఈ ట్రెండ్ పెద్ద హిట్ అయ్యింది.

అలా తెలుగు సహా తమిళ్ లో ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ కి వచ్చి మంచి వసూళ్ళని సాధించగా లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం “గిల్లీ” సెన్సేషన్ ని సెట్ చేసింది అని తమిళ సినీ వర్గాలు వారు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాల్లో హాలీవుడ్ నుంచి అవతార్, టైటానిక్ ఇండియా నుంచి షోలే చిత్రాలు తర్వాత విజయ్ నటించిన గిల్లీ ఒకటే నిలిచింది అట.

దీనితో ఆ సినిమాల తర్వాత ఈ శతాబ్దంలోనే విజయ్ సినిమానే (Ghilli Re Release) ఈ అరుదైన రికార్డు అందుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించగా ధరణి దర్శకత్వం వహించారు. మరి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, భూమిక లు నటించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు