చిరుతో పాటుగా బాలయ్య కూడా యాక్షన్ మోడ్ లోనే.!

చిరుతో పాటుగా బాలయ్య కూడా యాక్షన్ మోడ్ లోనే.!

Published on Apr 3, 2024 10:05 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ దిగ్గజ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలాగే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోలుగా తమ చిత్రాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ భారీ చిత్రం “విశ్వంభర” (Vishwambara). దీనిని వసిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా బాలయ్య నటిస్తున్న చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నాడు.

అయితే విశ్వంభర తో చిరు రీసెంట్ గానే ఓ సాలిడ్ యాక్షన్ షెడ్యూల్ లోకి జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య కూడా తన 109వ సినిమాకీ (NBK 109) యాక్షన్ మోడ్ లోకే దిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సాలిడ్ యాక్షన్ బ్లాక్ లను బాలయ్య (Balayya) పై మేకర్స్ చిత్రీకరిస్తున్నారట.

దీనితో మన టాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ కూడా తమ తమ సినిమాల్లో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ లలోనే బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా తదితరులు నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు