“గామి” : హను మాన్ తర్వాత మరోసారి ఓం రౌత్ పై

“గామి” : హను మాన్ తర్వాత మరోసారి ఓం రౌత్ పై

Published on Mar 2, 2024 1:38 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో పలు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎలాంటి వండర్స్ సెట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే కంటెంట్ కి తగ్గట్టుగా విజువల్స్ కూడా కనిపిస్తే ఆడియెన్స్ కూడా ఎంతో ఆదరిస్తున్నారు. మరి వీటితో రీసెంట్ గా వచ్చిన చిత్రం “హను మాన్” సెన్సేషనల్ సక్సెస్ అయ్యింది. చాలా తక్కువ బడ్జెట్ లో అదిరే విజువల్స్ తో మాసివ్ ట్రీట్ ని అందించిన ఈ చిత్రం చాలా మందిని ఆశ్చర్యచకితులను చేసింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో “ఆదిపురుష్” లాంటి సినిమా చేసిన దర్శకుడు ఓంరౌత్ విషయంలో చాలా విమర్శలు అప్పుడు వచ్చాయి. మరి మళ్ళీ హను మాన్ తర్వాత మరో టాలీవుడ్ చిత్రం “గామి” విజువల్స్ చూసాక మరోసారి ఓంరౌత్ పై అక్షింతలు పడుతున్నాయి.

ఇంత తక్కువ బడ్జెట్ లో గామి కి మైండ్ బ్లాకింగ్ విజువల్స్ వస్తే అంత ఖర్చు పెట్టి ఆదిపురుష్ సినిమాని పేలవంగా అందించాడని ఓంరౌత్ పై సోషల్ మీడియా ప్రజానీకం మరోసారి విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి అయితే గ్రాండ్ విజువల్స్ అందించడానికి మరీ భారీ బడ్జెట్ లు అవసరం లేదని యంగ్ దర్శకులు ప్రశాంత్ వర్మ, విద్యాధర్ లు ప్రూవ్ చేసారని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు