
యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా సినిమా ‘కార్తికేయ’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ లభించింది. నిఖిల్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు. 350 స్క్రీన్ లలో ఈ సినిమా విడుదలైంది. ఈ శుక్రవారం నుండి మరో 30 నుండి 40 థియేటర్లలో ‘కార్తికేయ’ సినిమాను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా ‘ఎ’ సెంటర్లలో సినిమాకు ఆదరణ బాగుంది. విడుదలైన రోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 3 షోలు వేయగా, తాజాగా ఆ సంఖ్యను 10కి పెంచారు. మిగతా మల్టీప్లెక్స్ లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
‘స్వామి రా రా’ తర్వాత స్వాతి మరోసారి నిఖిల్ కి జోడిగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మొదటి సినిమా అయినా చాలా చక్కగా తీశాడని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ ద్వారా వెంకట్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.