రంగస్థలం మూవీ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ కు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. అందుకు కారణం రంగస్థలం సినిమాకు తను చేసిన వర్క్. గతంలో అందాల రాక్షసి, సాహసం, కేరింత, భలే మంచి రోజు వంటి సినిమాలకు పనిచేసిన రామకృష్ణ ను పిలిచి అవకాశం ఇచ్చారు సుకుమార్. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో కొన్ని సినిమాలు సైన్ చేసాడు ఈ ఆర్ట్ డైరెక్టర్.
వివరాల్లోకి వెళ్ళితే… బాలయ్య నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు రామకృష్ణ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి సినిమా చేస్తున్నాడు అలాగే చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ సినిమాతో పాటు నాగ చైతన్య సవ్యసాచి సినిమాకు ఈ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు. రామకృష్ణ ఒక్క సినిమాకు తన ప్రతిభ చాటుకోవడంతో వరుసగా సినిమాలు వస్తున్నాయి.


