నెగిటివ్ వచ్చాక కరోనాపై పలు జాగ్రత్తలు చెప్పిన తారక్.!

Published on May 25, 2021 10:54 am IST

మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్న తారక్ పలు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. దీనితో తారక్ ఆరోగ్యంపై అభిమానులు కాస్త కలత చెందారు. అయినా మధ్యలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తారక్ ఆరోగ్యంపై కాస్త సమాచారాన్ని ఇవ్వగా తారక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

మరి ఇప్పుడు ఎట్టకేలకు ఒక శుభ వార్తను తారక్ తన అభిమానులకు చేరవేసాడు. తనకి ఇపుడు కరోనా నెగిటివ్ వచ్చింది అని తన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అంతే కాకుండా తన ఆరోగ్యం కోసం స్పెషల్ కేర్ తీసుకున్న వైద్యులకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు.

ఇక వీటితో పాటుగా తారక్ కరోనా పై మాట్లాడుతూ కరోనాను చాలా సీరియస్ గా తీసుకోవాలని కానీ అదే సమయంలో ఒక పాజిటివ్ మైండ్ తోని..మంచి కేర్ తీసుకున్నట్లయితే దానిని జయించవచ్చని తారక్ సూచించారు. అలాగే మన మనోధైర్యమే పెద్ద ఆయుధమని అందుకే ఎవరూ కంగారు పడకుండా ఉండాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

సంబంధిత సమాచారం :