‘ఆదర్శ కుటుంబం’పై మళ్లీ షాకింగ్ ట్విస్ట్!?

‘ఆదర్శ కుటుంబం’పై మళ్లీ షాకింగ్ ట్విస్ట్!?

Published on Sep 12, 2026 7:05 AM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల గ్యాప్ లో ఊహించని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఈ సినిమాకి సంగీతం హర్ష వర్ధన్ రామేశ్వర్ నుంచి మొదలైంది.

కానీ తర్వాత థమన్ ట్రాక్ లోకి వచ్చాడు. కొన్నాళ్ళు వర్క్ కూడా చేసాడు. కానీ నిన్న వచ్చిన టీజర్ అప్డేట్ లో మాత్రం థమన్ పేరు కానీ ప్రస్తావన కానీ లేదు. పైగా అప్డేట్స్ పరంగా ఎప్పుడూ సమాచారం అందించే థమన్ నుంచి కూడా నిన్న టీజర్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు. సో మళ్లీ సంగీత దర్శకుడు మారాడు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తనని ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్  సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ భర్తీ చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపై అసలు క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

తాజా వార్తలు