ఈ ఎపిసోడ్ తో మరో మెట్టు ఎక్కిన అభిజీత్.?

Published on Dec 5, 2020 12:22 pm IST

ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా నడుస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఆడియెన్స్ కు ఎవరెవరు టాప్ లిస్ట్ లో ఉన్నారు ఎవరు ఏ వారం వెళ్ళిపోతారు అన్నది ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆడియెన్స్ పల్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ది అనేకంటే టాప్ 3లో ఖచ్చితంగా అభిజీత్ ఉంటాడని చెప్పాలి. తనకున్న సమస్యలు తనకున్నా సరే మంచి క్లారిటీ అండ్ క్లియర్ కంటెస్టెంట్ గా కాస్త మెచ్యూర్డ్ గా ఆలోచించే కంటెస్టెంట్ గా గట్టి పోటీతో రాణిస్తున్నాడు.

ఇక అలాగే సోషల్ మీడియాలో అభికి గట్టి ఫాలోవర్సే ఉన్నారు. ఇప్పటి వరకు ఏ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కూడా చెయ్యని విధంగా భారీ ట్రెండ్స్ తో సెన్సేషన్ నమోదు చేశారు. మరి అభిను వారు ఇంతలా ఇష్టపడడానికి కారణాలు కూడా ఉంటాయి కదా అదే ఇప్పుడు అతన్ని మరో మెట్టు ఎక్కించిందని చెప్పాలి. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో కానీ అంతకు ముందు జరిగిన ఫైనల్స్ టికెట్ టాస్క్ లో కానీ తాను మొదటి స్థానం పాకులాడలేదు.

ఎవరు పోటీ పడ్డారో వాళ్ళకే వదిలేసాడు. అంటే వ్యక్తిత్వం పరంగా తాను తన ఆట ఆడుతున్నాడు అంతే అయ్యేది ఏదో లాస్ట్ కి అదే అవుతుంది అనే భావనలో ఉన్నాడు. ఇదే విషయాన్ని నిన్న బిగ్ బాస్ కొన్ని నంబర్స్ పెట్టి అందులో ఎవరెవరు దేనికి సరిపోతారో అన్నప్పుడు కూడా చాలా క్లియర్ గా తన వెర్షన్ ను చెప్పాడు. అది వీక్షకులకు కూడా ఎంతో నచ్చింది.

అలాగే తాను ఇతర కంటెస్టెంట్స్ లా పర్టికులర్ గా నాకు ఈ నెంబర్ సరైనది అందులోనే ఉంటాను అని చెప్పకుండా నేను ఆ నెంబర్ కు ఎందుకు ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ నెంబర్ కే కరెక్ట్ అని షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పడం తన క్లారిటీని అలాగే మిగతా కంటెస్టెంట్స్ తో కాస్త వేరుగా చూపిస్తుంది. అందుకే ఈ ఎపిసోడ్ తో అభిజీత్ మరో మెట్టు ఎక్కడని చెప్పొచ్చు. మరి ఇందుకే అభిజీత్ ఫాలోవర్స్ కూడా తనని అంతలా ఇష్టపడుతున్నామని చెప్తున్నారు.

సంబంధిత సమాచారం :