వాయిదాల మీద వాయిదాలతో ఆర్జీవీ “వ్యూహ, శపథాలు”

వాయిదాల మీద వాయిదాలతో ఆర్జీవీ “వ్యూహ, శపథాలు”

Published on Feb 23, 2024 9:00 AM IST

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏ తరహా సినిమాలు చేస్తున్నాడో చూస్తున్నాం. ఇక ఇపుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమాలు చేస్తుండగా తాను లేటెస్ట్ గా చేసిన రెండు సినిమాలు “వ్యూహం”, “శపథం” చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ చిత్రాలు గత ఏడాదిలో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా మొదట ఒకో చిత్రానికి గ్యాప్ నెల ఉండేలా ప్లాన్ చేసుకున్నారు కానీ ఇది కాస్తా వాయిదాలు పడుతూ వారం రోజుల గ్యాప్ కి వచ్చింది.

సరే ఇలా వచ్చినా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఫిబ్రవరికి చేంజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి కూడా సినిమాలు మళ్ళీ వాయిదా పడినట్టుగా ఆర్జీవీ తెలిపాడు. కొన్ని పొలిటికల్ పోస్టర్స్ తో ఈ చిత్రాలు వ్యూహం మార్చ్ 1 శపథం మార్చ్ 8న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. మరి ఈసారి అయినా వాయిదా పడకుండా వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు