“సర్కారు వారి పాట” ట్రీట్ పై మరోసారి క్లారిటీ.!

Published on Mar 5, 2021 8:00 am IST

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంతో మహేష్ తన హ్యాట్రిక్ జైత్ర యాత్ర కొనసాగించాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమాను ఎటు నుంచి చూసినా ప్రతిష్టాత్మక విలువలతోనే ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ఆల్బమ్ విషయంలో మొదటి నుంచి కూడా ఎన్నో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. థమన్ మరియు మహేష్ కాంబోలో వస్తున్న మరో సినిమా కావడంతో దీనిపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అనే ప్రశ్నకు థమన్ మరోసారి ఆన్సర్ ఇచ్చాడు.

వచ్చే ఆగష్టు లో ఖచ్చితంగా ట్రీట్ ఉంటుంది అని తన సోషల్ మీడియా చాట్ సెషన్ లో చెప్పాడు. సో ఈ సినిమా నుంచి ఆడియో ట్రీట్ అప్పటి నుంచి మొదలు కావడం పక్కా అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :