మరోసారి థియేటర్స్ లోకి ‘అతడు’.. ఈసారి గురి కుదురుతుందా!?

Athadu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పలు కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఎవర్ గ్రీన్ సినిమా అతడు కూడా ఒకటి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కం థ్రిల్లర్ సినిమా ఇప్పుడు మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ లో భారీ వసూళ్లనే కొల్లగొడుతుంది అనుకున్న సినిమా ఇది. అయితే కరెక్ట్ టైం ప్లానింగ్ మిస్ అయ్యి మొదటి రీరిలీజ్ అనుకున్న రేంజ్ వసూళ్లు అందుకోలేకపోయింది.

దీని పొటెన్షియల్ ఏంటి అనేది అందరికీ తెలుసు. అయితే ఫైనల్ గా రెండో రీ రిలీజ్ కి ఈ సినిమా సిద్ధం అయ్యింది. ఈ సారి ఈ ఫిబ్రవరి లోనే విడుదల కావడానికి సిద్ధం అయ్యింది. ఫిబ్రవరి 28న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈసారి అయినా గురి తప్పకుండా మంచి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ తదితరులు నటించగా మణిశర్మ సంగీతం అందించారు.

Exit mobile version