ప్యారడైజ్ పై మళ్లీ కొత్త పుకార్లు?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్కేల్ పరంగా కూడా మేకర్స్ ఎక్కడా తగ్గకుండా తీస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల నెల రానే వచ్చింది. నిజానికి గత నెల లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

సరే ఈసారి ఆన్ టైం వస్తుంది అనుకుంటే మళ్లీ రిలీజ్ పై కొత్త పుకార్లు మొదలయ్యాయి. ప్యారడైజ్ విడుదల మరో వారం వెనక్కి వెళ్లొచ్చు అనేది ఒకటైతే.. హిందీలో ఈ సినిమా రిలీజ్ కూడా ఆలస్యం కావచ్చు అనే టాక్ ఇంకొకటి వినిపిస్తుంది. దీనితో ది ప్యారడైజ్ పై ఈ కొత్త రూమర్స్ మళ్లీ ఫ్యాన్స్ ని గందరగోళం లోకి నెట్టేసాయి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version