మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సంచలన హిట్ చిత్రమే “ఇరుముడి”. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ రైడ్ చిత్రం రవితేజకి నెవర్ బిఫోర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా మూడో వారాంతం లోకి వచ్చినప్పటికీ సెన్సేషనల్ లాంగ్ రన్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు వరకు 81 లక్షలకు పైగా టికెట్ సేల్స్ ని జరుపుకుని రికార్డ్ రన్ సెట్ చేసింది.
దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ 80 లక్షలకి పైగా ఫుట్ ఫాల్స్ ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఇటీవల కాలంలో ఒక కోటికి పైగా ఫుట్ ఫాల్స్ ని పలు బిగ్ హీరోల పాన్ ఇండియా సినిమాలు మాత్రమే సొంతం చేసుకున్నాయి. కానీ ఒక అన్ సీజన్లో వచ్చి అది కూడా రీజనల్ సినిమాగా వచ్చి ఒక కోటి ఫుట్ ఫాల్స్ దిశగా ఇరుముడి హవా కొనసాగిస్తూ దూసుకెళ్లడం మాత్రం ఒక సంచలన చరిత్రే అని చెప్పాల్సిందే.
మరి ఈ వారాంతం పూర్తయ్యేసరికి 8.5 మిలియన్ ఫుట్ ఫాల్స్ అందుకోవడం గ్యారెంటీ. ఇది కేవలం ఆన్లైన్ బుకింగ్ టికెట్ సేల్స్ అయితే ఇరుముడి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో కొనసాగుతున్నాయి. చిన్న చిన్న సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఆఫ్ లైన్ లో టికెట్లు తెగుతున్నాయి. సో లాంగ్ రన్ లో ఈ సినిమా ఒక కోటి ఫుట్ ఫాల్స్ ని క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. సో ఈ సంచలన ఫీట్ ని ఇరుముడి అందుకుంటుందో లేదో చూడాలి.
