భయంకరమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి అలాంటి తారక్ లో అంతకు ముందు ఎప్పుడు చూపించని మాస్ యాంగిల్ ను ఎవరూ ఊహించని విధంగా “అరవింద సమేత” చిత్రంలో చూపించిన చూపించిన దర్శకుడు త్రివిక్రమ్. ఇక అక్కడ నుంచి ఈ కాంబోపై స్పెషల్ అంచనాలు సెట్టయ్యాయి.
మరి ఆ తర్వాత వీరి కాంబో నుంచి మరో సినిమాను ఆశించాలని అనుకున్న అభిమానులకు పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే మరో సినిమాను ప్రకటించేసారు. అయితే ప్రస్తుతం “RRR” షూట్ లో బిజీగా ఉన్న తారక్ దాని తర్వాత వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో పాల్గొననున్నారు.
అయితే ఈ చిత్రాన్ని కూడా ఈ కాంబో మళ్ళీ దసరా కల్లా పూర్తి చేసేసి నిలిపే అవకాశం ఉందని టాక్ విపిస్తుంది. వీరి కాంబోలో వచ్చిన లాస్ట్ సినిమా అరవింద సమేత ను కూడా దసరా కానుకగా విడుదల చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ ను కూడా అప్పటికే ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ఇక ఈ చిత్రానికి “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించిన సంగతి తెలిసిందే.
