థియేటర్ల తలుపులు మళ్ళీ తెరుచుకుంటున్నాయి..గెట్ రెడీ

గత ఏడాది భారతదేశంలో అడుగు పెట్టిన కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రభావం పెరిగిపోవడంతో అనేక పరిశ్రమలు మూట పడ్డాయి. అయితే ఆ అన్ని వర్గాల్లో మాత్రం తీవ్రంగా నష్టపోయింది సినీ పరిశ్రమ సినిమాను నమ్ముకున్న థియేటర్స్ వారే అని చెప్పాలి. నిజంగా అదొక పెద్ద డిజాస్టర్ వందలాది థియేటర్లు నడపలేక మూసివేయడం అనేవి సినీ అభిమానులకు ఎంతో బాధ కలిగించాయి.

మరి అవన్నీ దాటి ఎట్టకేలకు మళ్ళీ మన దేశంలో థియేటర్స్ తలుపులు తెరుచుకోవడం కొన్నాళ్ల పాటు పూర్వ వైభవం కూడా తెచ్చుకోవడం జరిగింది. కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పరిస్థితి మామూలు అయ్యిపోయింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పర్లేదు కానీ బాలీవుడ్ మార్కెట్ లో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా అయ్యింది. అక్కడ తెరుచుకున్న కొన్నాళ్లకే మళ్ళీ థియేటర్స్ మూత పడ్డాయి.

మరి ఫైనల్ గా ఇప్పుడు అక్కడ కరోనా ప్రభావం బాగా తగ్గుతుండడంతో పలు ఆంక్షలతో మళ్ళీ థియేటర్స్ తెరుచుకోడానికి రంగం సిద్ధం అయ్యింది. వచ్చే సోమవారం నుంచే మహారాష్ట్రలో పలు చోట్ల థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అలాగే ఇదే బాటలో మిగతా రాష్ట్రాల్లో కూడా థియేటర్లు తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది. సో మూవీ లవర్స్ మళ్ళీ థియేటర్స్ లో మీ అభిమాన సినిమాలు చూసేందుకు రెడీ కండి.. ఆది కూడా జాగ్రత్తలతో..

Exit mobile version