గేమ్ ఛేంజర్‌ ప్రమోషన్స్ షురూ

గేమ్ ఛేంజర్‌ ప్రమోషన్స్ షురూ

Published on May 16, 2024 3:00 AM IST

గేమ్ ఛేంజర్‌ సినిమాను ఈ నెల నాలుగో వారం నుంచి దూకుడుగా ప్రమోట్ చేయాలని తాజాగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ప్రమోషన్లకు సంబంధించి టీమ్ పక్కా ప్లాన్ తో షెడ్యూల్ కూడా వేసుకుందని టాక్. ముందుగా వరుసగా సాంగ్స్ అండ్ ప్రోమోస్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి నటీనటులు కూడా ముందు నుంచే ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు శంకర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. థమన్ సంగీత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు