భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్ కి శ్రీకారం చుట్టిన “ఆహా” స్టూడియో

భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్ కి శ్రీకారం చుట్టిన “ఆహా” స్టూడియో

Published on Feb 28, 2024 7:37 PM IST

ఇటీవల భారత ప్రభుత్వం మన దేశంలోనే మొదటి రెండు అత్యున్నత పురస్కారాల విషయంలో పలువురు పేర్లని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో పద్మవిభూషణ్ గా మెగాస్టార్ చిరంజీవి పేరుని అనౌన్స్ చేయగా అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే మెగాస్టార్ సహా మన తెలుగు సైతం కూడా ఎంతో గర్వించదగిన అంశం భారతదేశ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం.

మరి ఇప్పుడు ఆ మహనీయుని జీవిత చరిత్రని బయోపిక్ గా తీసుకొచ్చేందుకు మన తెలుగు స్ట్రీమింగ్ సంస్థ ఆహా వారు ఆహా స్టూడియోస్ గా అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సంయుక్తంగా అనౌన్స్ చేసిన సిరీస్ నే “హాఫ్ లయన్”. మరి ఈ పవర్ ఫుల్ టైటిల్ తో నరసింహారావు జీవితంలోని అతి ముఖ్యమైన భాగాన్ని అయితే పలు ఎపిసోడ్స్ కలిగిన వెబ్ సిరీస్ గా తాము తెరకెక్కిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

మరి ఈ సిరీస్ ని రెండు భాషల్లో నేషనల్ అవార్డు గ్రహీత ప్రకాష్ జాహ్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే వినయ్ సీతాపతి రచించిన నవల ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సిరీస్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుండగా మేకర్స్ తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించి తరువాత హిందీ లో డబ్ చేసి మొత్తం మూడు భాషల్లో అయితే స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు