లేటెస్ట్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ అందించిన ఆహా


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె, అలానే యువ దర్శకడు మారుతీ ఒక మూవీ షూటింగ్స్ లో ఆయన పాల్గొంటున్నారు. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కి తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి వచ్చారు ప్రభాస్.

ఈ నెల 30న ఆహాలో టెలికాస్ట్ కానున్న ఈ తాజా ఎపిసోడ్ యొక్క ప్రోమో ఇప్పటికే అందరినీ ఎంతో ఆకట్టుకుని భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, డిసెంబర్ 30 వరకు ఆగలేని డార్లింగ్ ఫ్యాన్స్ కి 3 నిమిషాల నిడివి గల ప్రభాస్ ఎపిసోడ్ తాలూకు స్నీక్ పీక్ ఎపిసోడ్ వీడియోని ప్రస్తుతం ఆహాలో అనిల్ రావిపూడి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాండప్ కామెడీ షో కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ నేటి నైట్ ఎపిసోడ్ తో జత చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version