మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత అభిషేక్‌ తో ఐశ్వర్య రాయ్‌ !

మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత అభిషేక్‌ తో ఐశ్వర్య రాయ్‌ !

Published on Jul 31, 2018 12:33 PM IST

aishwarya abhishek

ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ హీరోయిన్లుగా ఓ సినిమా రాబోతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఐతే గతంలో ఈ జంట ‘ఉమ్రావ్‌ జాన్’, ‘కుచ్‌ నా కహో’లతో పాటు మరో రెండు చిత్రాల్లో కలిసి నటించారు. మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకుంటూ తమ అభిమానులను అలరించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య రాయ్‌ నే మీడియాతో పంచుకున్నారు. తన భర్త అభిషేక్‌ బచ్చన్‌ తో కలిసి సర్వేశ్‌ మెవారా దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఆమె తెలిపారు.

కాగా ఈ చిత్ర కథ చాలా బాగుంటుందని, కథలోని పాత్రలకు అభిషేక్‌, నేను కరెక్ట్ గా సరోపోతామని ఐష్‌ చెప్పారు. ఐతే సినీవర్గాల సమాచారం ప్రకారం ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రానికి ‘గులాబ్‌ జామున్’ అనే టైటిల్‌ ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలయనున్నాయి.

తాజా వార్తలు