స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ కూడా ఒక కీలక పాత్ర చేయనున్నారు. ఆమె ఈ నెలలోనే షూటింగ్లో పాల్గొననున్నారు. తాజా సమాచారం మేరకు ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది.
వాటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాఫా మరొకటి ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర. ఈ పాత్రకు సినిమాలో మాటలు ఉండవని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఐశ్వర్య రాయ్ పాత్ర బాగా ఎగ్జైటింగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, కార్తి, త్రిష, విజయ్ సేతుపతి, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు.


