‘ఆర్ఆర్ఆర్’ నటుడికి చేదు అనుభవం

Published on Mar 3, 2021 2:12 am IST


‘ఆర్ఆర్ఆర్’ నటుడు, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నాడు ముంబైలోని గోరేగావ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డగించి నానా హంగామా చేశాడు. సదరు వ్యక్తి రైతుల ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపడం లేదని నిలదీశాడు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని రోడ్డు మీదే డిమాండ్ చేశాడు. చుట్టూ బాడీ గార్డులు ఉన్నా మాత్రం భయపడలేదు ఆ వ్యక్తి.

అసలే రైతుల ఉద్యమం విషయంలో సెలబ్రిటీల మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఉద్యమకారులు. ఇలాంటి టైంలో అతని మీద దురుసుగా ప్రవర్తిస్తే అనవసర వివాదాలకు కారణమవుతుందని భావించిన అజయ్ సెక్యూరిటీ మాటలతో నిలువరించే ప్రయత్నం చేసి సాధ్యంకాక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. అజయ్ దేవగన్ సెక్యూరిటీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లలో కూడ మిశ్రమ స్పందన కనబడుతోంది. కొందరైతే గతంలో అజయ్ దేవగన్ ప్రభుత్వానికి అనుకూలంగా చేసియన ట్వీట్లను గుర్తు చేశారు.

సంబంధిత సమాచారం :