స్టార్ హీరో ఇంట విషాదం

Published on May 27, 2019 3:43 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ నేడు ముంబైలో కన్నుమూశారు. కొన్ని నెలలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన, అలాగే వృద్ధాప్యం వలన వచ్చే అనేక ఆరోగ్య సమస్యలలతో కూడా బాధపడుతున్నారు.

వీరు దేవగణ్ ఒకప్పటి స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్. 70, మరియు 80 దశకాల్లో అనేక సూపర్ హిట్ హిందీ సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలకు కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అప్పటి స్టార్ హీరో అమితాబ్ తో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే వీరు దేవగణ్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. నేటి సాయంత్రం ముంబైలో ఆయన అంతిమ సంస్కారాలు జరుపనున్నారు.
Message Input

సంబంధిత సమాచారం :

More