క్రేజీ కాంబినేషన్ లో సినిమా లేనట్లే !

క్రేజీ కాంబినేషన్ లో సినిమా లేనట్లే !

Published on Oct 31, 2019 7:21 AM IST

ajith

స్టార్ హీరో అజిత్ తన 61వ సినిమాను ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నారనే వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. మురుగదాస్ 19 ఏళ్ల క్రితం అజిత్ హీరోగా రూపొందిన ‘ధీన’ చిత్రంతోనే దర్శకుడిగా మారారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారని వార్తలు మొదలవడంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మొదలైంది.
కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తాజా సమాచారం మేరకు ఈ వార్తలన్నీ అవాస్తవాలని, అసలు వీరి సినిమా ప్రపోజల్ లేదని తెలుస్తోంది.

‘విశ్వాసం, నెర్కొండ పారవై’ లాంటి వరుస హిట్లు అందుకున్న అజిత్ ప్రస్తుతం హెచ్.వినోత్ ‘వలిమై’ అనే సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు. అలాగే 61వ ప్రాజెక్టును ఆయన దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తారనే టాక్ కూడా ఉంది. ఇక మురుగదాస్ విషయానికొస్తే ఆయన రజనీకాంత్ హీరోగా రూపొందిస్తున్న ‘దర్బార్’ పనుల్లో బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు