
తమిళ హీరో అజిత్ అంటే ప్రశాంతతకు మారుపేరు. కనీసం సినిమా ఈవెంట్లలో కూడ కనిపించరు ఆయన. అభిమానుల పట్ల అయితే అజిత్ ప్రేమ అలాంటిది ఇలాంటిది కాదు. ఎప్పుడు ఎక్కడ ఆయన్ను చూడటానికి వెళ్లినా ప్రేమగా ట్రీట్ చేస్తారు. ఎంతమంది ఉన్నా అందరికీ ఫోటోలు ఇచ్చి పంపిస్తుంటారు. ఇప్పటివరకు ఆయన వేరొకరి మీద ముఖ్యంగా అభిమన్యుల మీద కోపగించుకోవడం జరగలేదు. ఫ్యాన్స్ ఈ విషయాన్నే సగర్వంగా చెప్పుకుంటుంటారు.
అలాంటి అజిత్‌కు విపరీతమైన కోపం వచ్చింది. అది కూడ తన అభిమాని మీదే కావడం గమనార్హం. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నందున అజిత్ తిరువాన్మియూర్ బూత్ లో ఓటు వేశారు. ఎప్పటిలాగే ఆయన్ను చూసిన జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరు అజిత్ పక్కకు చేరి ఫోటో తీసుకునేందుకు ట్రై చేశాడు. అతడికి మాస్క్ లేకపోవడం గమనించిన అజిత్‌కు కోపం వచ్చేసింది. వెంటనే అతని చేతుల్లో ఫోన్ లాగేసుకుని అక్కడి నుండి వెళ్ళమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాసేపటికి శాంతించిన ఆయన స్వయంగా ఫోన్ ను అభిమానికి ఇచ్చి సారీ చెప్పారు.