ఒక్క ఫొటోతో భీభత్సం చేసేసిన స్టార్ హీరో

Published on Nov 27, 2020 3:00 am IST

తమిళనాట అజిత్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు, ఆయన సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెద్ద ట్రెండ్ అయిపోతుంటుంది. ఇక ఆన్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ అయితే దుమ్ము దులిపేస్తుంటాయి. అజిత్ ప్రస్తుతం హెచ్.వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అజిత్ డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు. ముఖ్యంగా బైక్ స్టంట్స్ చేస్తున్నారు. దానికి సంభందించిన ఫోటో ఒకటి రిలీజ్ చేశారు టీమ్.

అజిత్ తన సూపర్ బైక్ ఫ్రంట్ వీల్ గాల్లోకి లేపి విన్యాసం చేస్తున్న ఆ ఫోటో అభిమానులకు విపరీతమైన కిక్ ఇచ్చేసింది. సోషల్ మీడియా మొత్తం అదే ట్రెండ్ అవుతోంది. ఎంతటి స్టార్ హీరోలైనా అజిత్ తరహాలో ఇలా సొంతగా బైక్ స్టంట్స్ చేయరు కదా అంటూ తమ హీరో మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సాహసాలు చేస్తూనే అజిత్ ఇటీవల గాయపడ్డారు. అయినా ఆయన వాయిదా వేయకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More