‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ఆకట్టుకున్న స్టార్ హీరో

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ఆకట్టుకున్న స్టార్ హీరో

Published on May 19, 2024 9:09 PM IST


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ ఒక సినిమా చేస్తున్నాడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమా గురించి సినిమా యూనిట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో అజిత్‌ను మూడు విభిన్న వ్యక్తీకరణలతో చూపించారు. మొత్తానికి మూడు విభిన్న షేడ్స్‌తో అజిత్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్ లో అజిత్ గ్రీన్ ప్రింటెడ్ చొక్కా ధరించగా, దానిపై డ్రాగన్ ఆకారాలు ఉన్నాయి. ఇక అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్నాడు. అజిత్ చేతిపై డ్రాగన్ టాటూలు, డ్రాగన్ ఆకారపు బ్రాస్‌లెట్‌ కూడా హైలైట్ గా ఉంది. మొత్తమ్మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచింది. అన్నట్టు ఈ సినిమాకి అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు