స్టార్ హీరో మూవీ మొదలెట్టేశారు

స్టార్ హీరో మూవీ మొదలెట్టేశారు

Published on Oct 19, 2019 10:56 PM IST

ఇటీవల నెర్కొండ పార్వై చిత్రంతో మంచి హిట్ అందుకున్న అజిత్ నేడు ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తన 60వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా నెర్కొండ పార్వై మూవీ టీం తో చేయడం గమనార్హం. నెర్కొండ పార్వై మూవీలో అజిత్ ని సెన్సిబుల్ లాయర్ గా చూపించిన దర్శకుడు హెచ్ వినోత్ ఈ మూవీలో పోలీస్ గా ప్రెసెంట్ చేయనున్నారట. పక్కా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుందని సమాచారం.

ఈ చిత్రాన్ని కూడా బోనీ కపూర్ నిర్మించనున్నాడు. దివంగత నటి శ్రీదేవికి నివాళులు అర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాలిమై అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసిన టీం ఈ మూవీని 2020 సమ్మర్‌లో విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చనున్నాడు. నయనతారని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ లో సెట్స్ పైకెళ్లనుండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు