మరోసారి పోలీస్ పాత్రలో స్టార్ హీరో

Published on May 29, 2019 10:00 pm IST

మన దక్షిణాది స్టార్ హీరోలకు పోలీస్ పాత్రలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఎవరైనా దర్శకుడు పవర్ఫుల్ పోలీస్ పాత్రను, దానికి తగిన మంచి కథను చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కొందరు హీరోలకైతే మళ్ళీ మళ్ళీ చేసినా ఆ పోలీస్ క్యారెక్టర్స్, ఆ కథలు బోర్ కొట్టనే కొట్టవు. అలాంటి వారిలో స్టార్ హీరో అజిత్ కూడా ఒకరు. ఇప్పటికే పలుసార్లు పోలీస్ పాత్రలు చేసి మెప్పించిన ఆయన మరోసారి కాప్ రోల్ చేయనున్నారు.

ప్రస్తుతం హెచ్.వినోత్ డైరెక్షన్లో హిందీ హిట్ సినిమా ‘పింక్’ తమిళ రీమేక్ చేస్తున్నారు అజిత్. అది పూర్తవగానే వినోత్ దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇందులో అజిత్ చేయబోయేది పోలీస్ ఆఫీసర్ పాత్రని తెలుస్తోంది. అసలు అజిత్ వినోత్‌కు రెండవసారి అవకాశం ఇవ్వడానికి అతని ప్రతిభతో పాటు అతను చెప్పిన పోలీస్ కథ కూడా ఒక కారణమని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More