ఓటిటిలో విజయ్ సినిమా కంటే అజిత్ సినిమాకే ఎక్కువ పొటెన్షియల్?

ఓటిటిలో విజయ్ సినిమా కంటే అజిత్ సినిమాకే ఎక్కువ పొటెన్షియల్?

Published on May 22, 2024 9:27 PM IST

తమిళ నాట ఉన్నటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోస్ లో దళపతి విజయ్ అలాగే థలా అజిత్ కుమార్ లు కూడా ఒకరు. మరి వీరి చిత్రాలకి తమిళ నాట రికార్డు వసూళ్లు నమోదు అవుతాయి. అయితే ఇద్దరి క్రేజ్ కూడా ఒకో సినిమాకి ఒకరిని ఒకరు క్రాస్ చేస్తూ ఉంటారు.

మరి తాజాగా వీరు నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం విజయ్ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) అలాగే అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” (Good Bad Ugly) చిత్రాలు రాబోతుండగా వీటిలో అజిత్ సినిమాకి ఓటిటిలో ఏకంగా 95 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టుగా బజ్ వినిపించింది.

అయితే దీని కంటే మరో 15 కోట్లు ఎక్కువ విజయ్ సినిమాకి పలికినట్టుగా లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే విజయ్ సినిమాకి ఏకంగా 110 కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ అయినా కూడా అజిత్ సినిమాదే పైచేయి అన్నట్టుగా వినిపిస్తుంది. ఇదెలా అంటే.. విజయ్ గోట్ సినిమాకి అన్ని భాషలూ పైగా మెయిన్ గా హిందీ రిలీజ్ విషయంలో జరిగిన డీల్ తో 110 కోట్లు పలికిందట.

ఇక అజిత్ సినిమాకి కేవలం తమిళ్ లేదా ఇతర సౌత్ ఇండియా భాషలు వరకే ఈ రేంజ్ ఫిగర్ నెట్ ఫ్లిక్స్ వారు ఇచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో అయితే ఓటిటి ఆఫర్ విషయంలో విజయ్ కంటే అజిత్ సినిమా పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టుగా చెప్పుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు