వైరల్ అవుతున్న స్టార్ హీరో కొత్త లుక్

వైరల్ అవుతున్న స్టార్ హీరో కొత్త లుక్

Published on Oct 5, 2019 7:20 PM IST

Ajith

తమిళనాట స్టార్ హీరోలలో ఒకరైన తల అజిత్ తన తదుపరి చిత్ర షూటింగ్ కొరకు సిద్దమవుఅతున్నారు. తన 60వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా అవుట్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఈ మూవీలో అజిత్ పోలీస్ గా కనిపించనున్నారని వినికిడి. ఐతే ఈ మూవీ కోసం అజిత్ గెటప్ పూర్తిగా మార్చేశారు.

అజిత్ కొన్నాళ్లుగా తెల్ల జుట్టు, గడ్డం. పెద్ద మీసాలతో దర్శన మిస్తున్నారు.గత కొంతకాలంగా పాత్రేదైనా ఆయన లుక్ కామనైపోయింది. కానీ తన అరవైయ్యవ చిత్రం కొరకు మాత్రం ఆయన గడ్డం తీసేయడంతో పాటు, జుట్టుకి రంగు కూడా వేయడం గమనార్హం. ఆయన తాజా లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన నెర్కొండ పార్వై హిట్ కొట్టింది.

తాజా వార్తలు