తమిళ స్టార్ హీరో తల’అజిత్’నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వాసం’లో రెండు పాత్రల్లో కనిపించనున్నారు అని సమాచారం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. సినిమా పాటలకు సంబంధించిన షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది .
వివేకం సినిమా తరువాత అజిత్ , శివ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాఫై చాలా అంచనాలు ఉన్నాయి . సత్య జ్యోతి ఫీలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బోస్ వెంకట్ , తంబీ రామయ్య , యోగి బాబు మొదలైన వారు నటిస్తున్నారు .విశ్వాసం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
