ఎలాంటి అప్డేట్ లేకుండా “వలిమై” భారీ ఫిగర్ ఇక్కడ ఆగిందట.!

Published on Jul 6, 2021 1:07 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ ప్రాజెక్ట్ “వలిమై” కోసమే గత కొన్నాళ్లుగా సౌత్ ఇండియన్ సినిమా అంతా రచ్చ లేస్తుంది. అజిత్ నుంచి చాలా కాలం అనంతరం వస్తున్న సినిమా కావడంతో మోస్ట్ అవైటెడ్ గా ఈ చిత్రం నిలిచింది. మరి మరోపక్క గత మూడు నాలుగు రోజులుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఆసక్తికర టాక్స్ వినిపిస్తూ వస్తున్నాయి.

ఇంకా ఫస్ట్ లుక్ అప్డేట్ కూడా రాని ఈ చిత్రం ఏకంగా 200 కోట్ల మేర వరల్డ్ వైడ్ బిజినెస్ జరిపింది అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ టోటల్ ఫిగర్ ఎక్కడ ఆగింది అన్న దానిపై ఇప్పుడు మరింత సమాచారం తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే వలిమై ప్రీ రిలీజ్ బిజినెస్ 215 నుంచి 220 కోట్ల మేర జరిగినట్టు టాక్.

అది కూడా ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేకుండా.. అలాగే కోలీవుడ్ లో అయితే రజిని నటించిన “2.0” తర్వాత ఇదే అత్యధికం అని కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అజిత్ సినిమా క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :