సోషల్ మీడియాని షేక్ చేసిన అజిత్ మాస్ క్రేజ్.!

సోషల్ మీడియాని షేక్ చేసిన అజిత్ మాస్ క్రేజ్.!

Published on May 21, 2024 11:29 PM IST

దక్షిణాది సినిమా దగ్గర అపారమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో కోలీవుడ్ బిగ్ స్టార్ థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి థలా హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తన అభిమాని టర్న్డ్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. మరి అనౌన్స్ చేసిన నాటి నుంచే మంచి అంచనాలు అందుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఇచ్చేసారు.

అయితే ఈ ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విట్టర్) షేక్ అయ్యింది. వచ్చిన రోజే భారీ స్థాయిలో ఇంప్రెషన్స్ అందుకోగా ఇప్పుడు ఇది ఏకంగా 41 మిలియన్స్ చేరి నెవర్ బిఫోర్ గా నిలిచింది. అయితే ఇది మాత్రం ప్యూర్ అజిత్ క్రేజ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మన టాలీవుడ్ హిట్ నిర్మాణ సంస్థ మైత్రి మొవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు