హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన స్టార్ హీరో.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన స్టార్ హీరో.

Published on Jan 3, 2020 9:47 AM IST

అజిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాలమై’. అజిత్ 60వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని దర్శకుడు హెచ్ వినోత్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో నిర్వహించారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావంతో చిత్ర యూనిట్ చెన్నైకి చేరుకున్నారని తెలుస్తుంది. తదుపరి షెడ్యూల్ చెన్నైలో జరగనుందని సమాచారం. అజిత్ ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి రోల్ చేస్తున్నారట.

అజిత్ గత చిత్రాలలో నెరిసిన జుట్టు, గడ్డంతో ఒకే లుక్ లో కనిపించారు. ఐతే ఈ చిత్రంకోసం ఆయన లుక్ చేంజ్ చేశారు. ఆయన బరువు కూడా తగ్గారు. తన గత చిత్రం నెర్కొండ పార్వై చిత్రానికి దర్శకత్వం వహించిన వినోత్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తుండగా బోనికపూర్ నిర్మిస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన నెర్కొండ పార్వై సూపర్ హిట్ గా నిలిచింది. అజిత్ గత చిత్రాలకు మించి హై బడ్జెట్ తో వాలమై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు