షాకింగ్ : మరోసారి రిస్కీ సీక్వెన్స్ లో గాయపడ్డ అజిత్.. వీడియో వైరల్

షాకింగ్ : మరోసారి రిస్కీ సీక్వెన్స్ లో గాయపడ్డ అజిత్.. వీడియో వైరల్

Published on Apr 4, 2024 2:00 PM IST


ఇండియన్ సినిమా దగ్గర యాక్షన్ సీక్వెన్స్ లకి సంబంధించి స్వయంగా చాలా రిస్క్ తీసుకునే హీరోస్ చాలా తక్కువమందే ఉంటారు. మరి అలాంటి హీరోస్ లో కోలీవుడ్ నుంచి థలా అజిత్ కుమార్ (Ajith Kumar) కూడా ఒకరు. అజిత్ బైక్స్ తోనే ఎంతో రిస్కీ సీన్స్ ని తన కెరీర్ లో చేసారు. ప్రొఫిషనల్ గా రేసర్ కావడంతో ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో రిస్క్ లు చేయడం వాటిలో గాయాలు పాలు కావడం కూడా జరిగింది. అయితే తన భారీ యాక్షన్ చిత్రం “వలిమై” (Valimai) సమయంలోనే ఓ క్రేజీ బైక్ సీక్వెన్స్ చేస్తూ పడిపోయారు. కానీ సినిమాలో ఓ రేంజ్ లో ఆ సీక్వెన్స్ వచ్చింది.

అయితే తాజాగా మరో ఘోర ప్రమాదం నుంచి అజిత్ తప్పించుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు మాగిజ్ తిరుమనేని కాంబినేషన్ లో “విడా ముయార్చి” (Vidaa Muyarchi) చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అజిత్ మేనేజర్ ఓ షాకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ వీడియో ఇది. మరి ఇందులో అజిత్ కార్ నడుపుతూ ఓ ఇంటెన్స్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో రోడ్ పైన ఆ కారు అదుపు తప్పి పడిపోయింది. దీనితో సినిమా సిబ్బంది హుటాహుటిన కారు దగ్గరకి వెళ్లి అజిత్ సహా తనతో ఉన్న మరో నటుడిని బయటకి తీసే ప్రయత్నం చేశారు. దీనితో ఈ వీడియో చూసిన అభిమానులు అయితే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అజిత్ చాలా రిస్క్ తీసుకుంటారని తెలిసిందే కానీ ఈ వీడియో మాత్రం మరో రేంజ్ లో ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు