తలా అజిత్ కుమార్, త్రిష మరియు అనుష్క నటించిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా కోసం నిరీక్షించిన తమిళ ప్రేక్షకులకు మంచి ఫలితమే దక్కింది. గౌతం వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళనాట కేవలం రెండురోజుల్లో 20కోట్లు సంపాదించింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్ నటన, త్రిష అందచందాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. గౌతం మీనన్ చిత్రీకరణ, హారిస్ జయరాజ్ సంగీతం ప్రతీఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో విడుదలకానుంది.
