
‘జబర్దస్త్’ కామెడీ షోతో ధనాధన్ ధన్ రాజ్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన నటుడు ధన్ రాజ్. టాలీవుడ్ లేటెస్ట్ ఫేమస్ తాగుబోతు కమెడియన్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు తాగుబోతు రమేష్. ఇప్పటివరకూ కామెడీ పాత్రల్లో నవ్వించిన ఈ ఇద్దరు కమెడియన్స్ హీరోలుగా చేసిన కామెడీ ఎంటర్టైనర్ ‘AK రావ్ PK రావ్’. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో మే 17న విడుదల కానుంది.
ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లను దృష్టిలో పెట్టుకొనే చేసిన ఈ సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని బాగా నవ్విస్తుందని డైరెక్టర్ కోటపాటి శ్రీను అంటున్నాడు. ధక్షనగార్కర్, శృతి రాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో తెలుగు ఫేమస్ కమెడియన్స్ అయిన ఎంఎస్ నారాయణ, కృష్ణభగవాన్, రఘుబాబు, వెన్నెల కిషోర్, కొండవలస, సాయాజీ షిండేలు కూడా ప్రముఖ పాత్రల్లో నవ్వించనున్నారు. సాయి వెంకటేశ్వరా కంబైన్స్ బ్యానర్ పై నిమించిన ఈ సినిమాకి కెఎస్ఆర్ సంగీతం అందించాడు.

