కన్నడ లోకి ఎంట్రీ ఇస్తున్న దేవదాస్ హీరోయిన్ !

కన్నడ లోకి ఎంట్రీ ఇస్తున్న దేవదాస్ హీరోయిన్ !

Published on Oct 23, 2018 8:36 PM IST

‘మళ్ళీరావా’ చిత్రం తో తెలుగు లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది టీవీ నటి ఆకాంక్ష సింగ్. ఈ చిత్రంలో సుమంత్ తో కలిసి నటించింది. సినిమా కూడా మంచి విజయం సాధించినా కానీ ఎందుకో ఎక్కువగా ఆవకాశాలను రాబట్టుకోలేక పోయింది. ఇక ఈ చిత్రం తరువాత కింగ్ నాగార్జున , నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ ‘దేవదాస్’ చిత్రంలో నాగ్ కు జోడిగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది.

ఇక ఇప్పుడు ఆకాంక్ష కన్నడ లోకి ఎంట్రీ ఇస్తుంది. స్టార్ హీరో కిచ్చా సుధీప్ నటిస్తున్న ‘పహిల్వాన్’ అనే చిత్రంలోఆయనకు జోడిగా నటిస్తుంది. ఈచిత్రంలో ఆమె రెండు షేడ్స్ వున్నా పాత్రలో నటిస్తుంది . బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో ఓక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు