Akhanda-2 New Ticket Prices : ‘అఖండ 2’ కొత్త టికెట్ రేట్లు ఇవే.. ఇక బాక్సాఫీస్ దగ్గర తాండవమే.!

Akhanda-2 New Ticket Prices : ‘అఖండ 2’ కొత్త టికెట్ రేట్లు ఇవే.. ఇక బాక్సాఫీస్ దగ్గర తాండవమే.!

Published on Dec 10, 2025 6:41 PM IST

Akhanda-2

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’(Akhanda 2) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతవారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో ఇప్పుడు సరికొత్త డేట్‌తో ఈ చిత్రం డిసెంబర్ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.

గతంలో పెరిగిన టికెట్ రేట్లు..

అయితే, డిసెంబర్ 5న సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేసిన మేకర్స్.. అప్పుడు కూడా సినిమా టికెట్ రేట్ల(Ticket Prices) పెంపు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. పెయిడ్ ప్రీమియర్ షోకు రూ.600/- టికెట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 అదనంగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అటు ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకరించింది. కానీ, ఆ సమయంలో సినిమా రిలీజ్ కాలేదు.

ఇప్పుడు కూడా అవే రేట్లు..

ఇక ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2(Akhanda 2) టికెట్ రేట్లు పెరిగాయి. పెయిడ్ ప్రీమియర్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.600 ధరతో టికెట్లు అమ్మనున్నారు. తెలంగాణలో గతంలో పెంచిన రేట్లతోనే మరోసారి జోవీ జారీ చేసింది ప్రభుత్వం. పెరిగిన టికెట్ రేట్లు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 14 వరకు అందుబాటులో ఉండనుననాయి. ఏపీలో మాత్రం టికెట్ రేట్ల పెంపు డిసెంబర్ 12 నుండి పదిరోజుల పాటు కొనసాగనుంది.

టికెట్ రేట్ల(Ticket Prices) విషయంపై క్లారిటీ రావడంతో ఇక ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మరోసారి తాండవం చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

a

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు