భారీ బడ్జెట్ తో బాలయ్య “అఖండ 2”

భారీ బడ్జెట్ తో బాలయ్య “అఖండ 2”

Published on May 19, 2024 12:36 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులని అలరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ చివరిసారిగా భగవంత్ కేసరి చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే నందమూరి బాలకృష్ణ తో మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను అఖండ చిత్రం తో బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ అఖండ 2 మరోసారి వార్తల్లో నిలిచింది.

అఖండ 2 అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు మేకర్స్. దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అఖండ 2 రూపొందనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ నిర్మాతలు ఈ సినిమాను భారీగా మారితే చేయనున్నారు. బాలకృష్ణ కూడా టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అతని గత కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా ముగిశాయి. బాబీ దర్శకత్వంలో బాలయ్య తన కొత్త చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెప్టెంబర్ 2024లో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు