నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఒక వాయిదా తర్వాత ఎట్టకేలకి వారం గ్యాప్ లో సినిమా మళ్ళీ థియేటర్స్ లో రాబోతుంది. అయితే ఈ వారం వ్యవధి తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేసుకున్న ఈ సినిమా అంతకు మించిన ర్యాంపేజ్ చూపిస్తుంది అని చెప్పాలి.
ఆల్రెడీ నిన్నటి బుకింగ్స్ లోనే కాకుండా ఇవాళ్టి బుకింగ్స్ చూసుకున్నా కూడా అఖండ 2 హవర్లి ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే హైక్స్ ఉన్నా 2డి, 3డి అని లేకుండా అఖండ 2 టికెట్లు తెగుతున్నాయి. సో అభిమానులు ఇతర ఆడియెన్స్ ఈ సినిమా పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


