గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2: తాండవం’పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించే ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో సాలిడ్ హైప్‌ను సృష్టిస్తున్నాయి.
ఇక ఈ సినిమా గత వారం రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్స్‌తో, డిసెంబర్ 12న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం భారీ స్థాయిలో టికెట్ బుకింగ్స్ చేస్తున్నారు.
కేవలం ఒక గంటలో 18.5K టికెట్లు బుక్ అవ్వడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కి నిదర్శనం. నందమూరి అభిమానులు, యాక్షన్ లవర్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని తొలిరోజే వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పెయిడ్ ప్రీమియర్స్ టికెట్లు ఓపెన్ అయితే, వాటికి ఎలాంటి డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అఖండ 2: తాండవం ఈ సంవత్సరం చివర్లో బాక్సాఫీస్‌ను హై వోల్టేజ్‌గా షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.


