అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ప్రస్తుతం చిత్రబృందం సాంగ్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటివలే ఫిల్మ్ సిటీ లో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ ను షూట్ చేశారు. ఆ సీన్స్ చాల బాగా వచ్చాయట. ఈ సీన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.
ఇక ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. ఈ సినిమాతోనైనా అఖిల్ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.


