“సలార్ 2” లో అఖిల్ – క్లారిటీ ఇదే.!

“సలార్ 2” లో అఖిల్ – క్లారిటీ ఇదే.!

Published on Jan 20, 2024 5:01 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై ఫ్యాన్స్ కి మాస్ ఆడియెన్స్ కి మాసివ్ ట్రీట్ ఇచ్చి అదరగొట్టింది.

ఇక ఈ నెల లోపే సినిమా ఇపుడు ఓటిటి లో కూడా వచ్చేయడంతో అంతా మళ్ళీ సలార్ ట్రాన్స్ లో తేలుతున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ వేడుకలు కూడా ఈ మధ్య మేకర్స్ చేయగా అందులో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా కనిపించడం అందరిలో ఆసక్తి రేపింది. పార్ట్ 2 లో గాని అఖిల్ ఉన్నాడా అనే ప్రశ్న చాలా మందిలో ఎగ్జైటింగ్ గా మారగా అసలు దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అవ్వగా అందులో అఖిల్ పెజెన్స్ పై క్లారిటీ ఇచ్చారు. సలార్ 2 లో అఖిల్ ఉన్నాడు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని కన్ఫర్మ్ చేశారు. సో సలార్ శౌర్యంగ పర్వంలో అఖిల్ లేనట్టే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు