అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త చిత్రాల్లో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న గ్రామీణ నేపథ్య మాస్ చిత్రం ‘లెనిన్’ కూడా ఒకటి. ఎపుడో షూట్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ వస్తుంది. రీసెంట్ గానే మే 1 నుంచి జూన్ కి వాయిదా అని కన్ఫర్మ్ చేశారు.
కానీ ఇప్పుడు జూన్ నుంచి కూడా సినిమా మళ్ళీ వెనక్కి వెళుతున్నట్టు గట్టి బజ్ వినిపిస్తుంది. ఇక కొత్త డేట్, రిలీజ్ ప్లాన్స్ ఏంటి అనేవి చూస్తే ఈసారి సినిమా జూన్ నుంచి జూలై లేదా ఆగస్ట్ విడుదలకి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఓ ఇంకో నెల లేదా నెలన్నర గ్యాప్ సినిమా తీసుకోనుంది అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
